Neeraj: సైలెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నీరజ్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

by Ramesh Goud |   ( Updated:2025-01-20 12:03:08.0  )
Neeraj: సైలెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నీరజ్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఒలింపిక్ పతక విజేత(Olympic Medalist), జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఓ ఇంటి వాడయ్యారు. ప్రైవేట్ వెడ్డింగ్ జరుపుకున్న తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్(Indian Star Javelin Thrower) నీరజ్ చోప్రా ఆదివారం వివాహం(Married) చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఓ ప్రైవేట్ వేడుకలో నీరజ్ పెళ్లి జరిగింది. తన భార్య పేరు హిమాని(Himani). ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

దీనిపై నీరజ్.. నా కుటుంబసభ్యుల సమక్షంలో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని రాసుకొచ్చాడు. అంతకముందు నీరజ్ తన పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తెలియపరచలేదు. దీంతో ఈ వార్త విన్న నీరజ్ చోప్రా అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించగా.. 2024 పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed