- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా అదరగొడుతున్నాడు. దోహ డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల ప్రదర్శనతో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన అతను ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ఈవెంట్‌లో నీరజ్ 85.29 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. ఆరు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ చేసిన నీరజ్.. మిగతా నాలుగు ప్రయత్నాల్లో 80 మీటర్లపైనే త్రో చేశాడు. వరుసగా 83.45, 85.29, 82.17, 81.01 మీటర్లు విసిరాడు. సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 84.12 మీటర్ల త్రోతో రజతం గెలిచాడు. మాజీ వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్(83.63 మీటర్లు) కాంస్యంతో సరిపెట్టాడు.
- Tags
- Neeraj Chopra
Next Story






