ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టిన నీరజ్.. ఆ టోర్నీలో స్వర్ణం కైవసం

by Harish |

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టాడు.

ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టిన నీరజ్.. ఆ టోర్నీలో స్వర్ణం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టాడు. సౌతాఫ్రికాలో జరిగిన పోచెఫ్‌స్ట్రూమ్ ఇన్విటేషన్ మీట్‌లో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. బుధవారం రాత్రి జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ 84.52 మీటర్ల ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. లోకల్ అథ్లెట్లు డౌ స్మిత్, డంకన్ రాబెర్ట్‌సన్‌లను నీరజ్ వెనక్కినెట్టాడు. ఆరుగురు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో ఇద్దరు మాత్రమే 80 మీటర్ల మార్క్‌ను అందుకున్నారు. నీరజ్ తర్వాత డౌ స్మిత్ 82.44 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మరో సౌతాఫ్రికా అథ్లెట్ రాబెర్ట్‌సెన్ 71.22 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచి పోడియం ముగించాడు. నీరజ్ తన కొత్త కోచ్ మూడుసార్లు ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ అయిన జాన్ జెలెజ్నీ ఆధ్వరంలో పోచెఫ్‌స్ట్రూమ్ శిక్షణ పొందుతున్నాడు. నీరజ్ మేలో జరగబోయే దోహా డైమండ్ లీగ్‌పై ఫోకస్ పెట్టాడు.


Next Story