- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neeraj Chopra : కొత్త కోచ్‌ను అనౌన్స్ చేసిన నీరజ్ చోప్రా
ఒలంపిక్స్‌లో రెండు సార్లు మెడల్స్ గెలిచిన నీరజ్ చోప్రా జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీని కోచ్‌గా నియమించుకున్నట్లు శనివారం అనౌన్స్ చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : ఒలంపిక్స్‌లో రెండు సార్లు మెడల్స్ గెలిచిన నీరజ్ చోప్రా జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీని కోచ్‌గా నియమించుకున్నట్లు శనివారం అనౌన్స్ చేశాడు. మూడు సార్లు ఒలంపిక్, వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ జాన్ జెలెన్జీ నీరజ్ చోప్రాకు తొలి నుంచి స్ఫూర్తిగా ఉన్నారు. ఆయనే ఇప్పుడు నీరజ్ చోప్రాకు కోచ్‌గా కొత్త పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘జాన్ టెక్నిక్, ఖచ్చితత్వాన్ని వీడియోల్లో చూస్తూ పెరిగాను. ఈ ఆటలో చాలా యేళ్లు ది బెస్ట్‌గా ఆయన కొనసాగారు. ఆయనతో కలిసి ప్రయాణం చేయనుండటం ఎంతో అమూల్యమైన విషయం. మా ఇద్దరి విసిరే విధానం దగ్గరగా ఉంటుంది. నా జీవితంలో నెక్ట్స్ లెవల్‌కి వెళ్తున్న సమయంలో ఆయన నాతో ఉండటం గౌరవంగా భావిస్తాను..’ అన్నాడు. జెలెజ్నీ గైడెన్స్‌లో తన టెక్నికల్ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకుంటానని నీరజ్ అన్నాడు.






