- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Neeraj Chopra : నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా
భారత జావెలిన్ త్రో అథ్లెట్(Indian Javelin Throw Athlete), ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా(Olympic Gold Medalist Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత జావెలిన్ త్రో అథ్లెట్(Indian Javelin Throw Athlete), ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా(Olympic Gold Medalist Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్(Lieutenant Colonel in the Territorial Army) గౌరవ హోదాను ప్రకటించింది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ నియామకం ఏప్రిల్ 16, 2025 నుంచి అమలులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం 'ది గెజిట్ ఆఫ్ ఇండియా'(The Gazette of India)లో పేర్కొంది. నీరజ్ 2016లో భారత సైన్యంలో నాయబ్ సుబేదార్(Nayab Subedar) హోదాతో చేరి, 2021లో సుబేదార్, ఆ తర్వాత సుబేదార్ మేజర్గా(Subedar Major) పదోన్నతి పొందారు.
టోక్యో ఒలింపిక్స్(2021)లో బంగారు పతకం, పారిస్ ఒలింపిక్స్(2024)లో రజత పతకంతో భారత్‌కు గౌరవం తెచ్చిన తొలి అథ్లెట్‌గా నీరజ్ నిలిచారు. అలాగే 2023లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతోపాటు 2018, 2023 ఆసియా గేమ్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతలతో పరమ విశిష్ట సేవా మెడల్(PVSM), పద్మశ్రీ, విశిష్ట సేవా మెడల్(VSM)లను అందుకున్నారు. ఈ గౌరవ హోదాతో నీరజ్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా వంటి క్రీడాకారుల సరసన చేరారు. ఈ హోదా ఆయన క్రీడా విజయాలకు, దేశ గౌరవానికి గుర్తింపుగా ఇవ్వబడింది.






