- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీరజ్ నెంబర్ వన్.. జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
by Phanindra |
నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

X
దిశ, స్పోర్ట్స్: స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న అతను.. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన ప్రపంచ జావెలిన్ త్రోయింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతంలో నీరజ్ నుంచి గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ ఈ స్థానాన్ని లాగేసుకున్నాడు. ఇప్పుడు 1,445 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు నీరజ్ చేరుకున్నాడు. రెండో స్థానంలో 1,431 పాయింట్లతో పీటర్స్ ఉండగా.. 1,407 పాయింట్లతో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
Next Story






