Neeraj Chopra: మరో సరికొత్త రికార్డు.. స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా

by Kema Shiva Kumar |

జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌, భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య భాగస్వామ్యంతో శనివారం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన తొలి ‘నీరజ్ చోప్రా క్లాసిక్-2025’ ఈవెంట్‌లో భారతదేశ జావెలిన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) సత్తా చాటాడు.

Neeraj Chopra: మరో సరికొత్త రికార్డు.. స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా
X

దిశ, వెబ్‌డెస్క్: జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌, భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య భాగస్వామ్యంతో శనివారం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన తొలి ‘నీరజ్ చోప్రా క్లాసిక్-2025’ ఈవెంట్‌లో భారతదేశ జావెలిన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) సత్తా చాటాడు. ఏకంగా 86.18 మీటర్లు దూరం బళ్లెం విసిరి ఈ వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్-లెవల్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కెన్యాకు చెందిన జూలియస్ యెగో తన సీజన్-బెస్ట్ 84.51 మీటర్లతో రెండో స్థానం సాధించగా, శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 84.34 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. దోహాలో డైమండ్‌ లీగ్‌, గోల్డ్‌ స్పైక్‌ గెలిచిన చోప్రాకు ఇది వరుసగా మూడో టైటిల్‌ కావడం విశేషం.


Next Story