ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ లీగ్‌పై నిషేధం

by Harish |

ఐసీసీ సంచలనం నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరిగే నేషనల్ క్రికెట్ లీగ్(ఎన్‌సీఎల్)పై నిషేధం విధించింది.

ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ లీగ్‌పై నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ సంచలనం నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జరిగే నేషనల్ క్రికెట్ లీగ్(ఎన్‌సీఎల్)పై నిషేధం విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా అమెరికా క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది. ఎన్‌సీఎల్ భవిష్యత్తు ఎడిషన్లకు అనుమతి ఇవ్వమని తెలిపింది. ఎన్‌సీఎల్ అనుమతి నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్లేయింగ్ ఎలెవన్ నియమాలను ఎన్‌సీఎల్ పాటించలేదని సమాచారం. తుది జట్టులో ఏడుగురు అమెరికా అనుబంధమైన లేదా అసోసియేట్ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది.

కానీ, అనేక సందర్భాల్లో ఆరుగురు లేదా ఏడుగురు విదేశీ ప్లేయర్లు మైదానంలో కనిపించారు. అలాగే, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పిచ్‌లు బాగా లేవు. వాహబ్ రియాజ్, టైమల్ మిల్స్ వంటి బౌలర్లు బ్యాటర్లకు గాయాలు కాకుండా స్పిన్ వేయాల్సి వచ్చింది. లీగ్‌లో విదేశీ ప్లేయర్లకు అవకాశం కల్పించడానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం మరో ప్రధాన కారణం.

టోర్నీలో పాల్గొనే విదేశీ ప్లేయర్లందరూ చెల్లుబాటు అ య్యే స్పోర్ట్స్ వీసాలతో అమెరికాలో అడుగుపెట్టలేదని ఓ ప్రముఖ క్రీడా మీడయా సంస్థ తెలిపింది. ఎన్‌సీఎల్‌‌పై నిషేధం ఇప్పుడిప్పుడు క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికాకు భారీ షాకే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌సీఎల్‌ ఓనర్‌షిప్ గ్రూపులో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌ భాగం కావడం గమనార్హం.

Next Story