- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన జాతీయ షూటింగ్ కోచ్!.. ఎవరికైనా చెబితే కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులు

దిశ, స్పోర్ట్స్ : జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై పోక్సో కేసు నమోదైంది. మైనర్, 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్యానా పోలీసులు అతనిపై కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంకుశ్‌ను నేషనల్ రైఫిల్ అసోసియేన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) సస్పెండ్ చేసింది. ఎన్‌ఆర్‌ఏఐ నియమించిన 13 మంది జాతీయ పిస్టల్ కోచ్‌లలో అంకుశ్ ఒకరు.
బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన షూటర్‌ను అంకుశ్ ఆటతీరును అంచనా వేస్తానని ఫరీదాబాద్‌లోని ఓ హోటల్ గదిలోకి పిలిపించాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన కెరీర్ నాశనం చేస్తానని, తన కుటుంబానికి హాని చేస్తానంటూ కోచ్ బెదిరించాడని షూటర్ ఫిర్యాదులో పేర్కొంది. మరో మహిళా షూటర్ కూడా అదే కోచ్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొందని ఆరోపించింది. కుటుంబసభ్యులు ఫరీదాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అంకుశ్‌పై పోలీసులు పోక్సో సహా పలు కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఘటన జరిగిన రోజు హోటల్ సీసీ పుటేజ్‌ను సేకరించే పనిలో ఉన్నారు.






