- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
భారత మహిళల క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లాండ్ మహిళల జట్టు ఖరారైంది.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లాండ్ మహిళల జట్టు ఖరారైంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. రెండో టీ20లో గాయపడి టీ20 సిరీస్ మొత్తానికి దూరమైన కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ వన్డే జట్టుకు అందుబాటులోకి రావడం ఇంగ్లాండ్‌కు ఊరటనిచ్చే విషయం. స్పిన్నర్ ఎక్లోస్టోన్, బ్యాటర్ మైయా బౌచియర్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. గాయాల కారణంగా వీరు మే-జూన్‌లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం కోలుకున్న వీరు భారత్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే తిరిగి వన్డే జట్టుకు అందుబాటులోకి వచ్చారు. ఎక్లోస్టోన్ రాకతో స్పిన్ ఆల్‌రౌండర్ సారాహ్ గ్లెన్‌ను తప్పించారు. ఈ నెల 16 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ముగియగా భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నది.
ఇంగ్లాండ్ మహిళల వన్డే జట్టు
నాట్ స్కివర్ బ్రంట్(కెప్టెన్), ఎమ్ అర్లాట్, టమ్మీ బ్యూమాం్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఎలైస్ క్యాప్సీ, కాటె క్రాస్, ఎలైస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లోస్టోన్, లారెన్ ఫిలెర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సీ స్మిత్.
- Tags
- ind w vs eng w






