- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPLలో సరికొత్త చరిత్ర..తొలి సెంచరీ నమోదు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో సరికొత్త చరిత్ర నమోదయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి సెంచరీ నమోదు చేశారు ముంబైకి చెందిన నాట్ స్కివర్-బ్రంట్. 57 బంతులు ఎదుర్కొన్న నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ నమోదు చేశారు. ఇందులో ఒక సిక్సర్, 16 బౌండరీలు ఉన్నాయి. దీంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో తొలి సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డులోకి నాట్ స్కివర్-బ్రంట్ ఎక్కింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లు ఆడి, నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడిస్తే, ముంబైకి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






