తోటి ప్లేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన పాక్‌ పేసర్..

by Vinod kumar |

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాక్‌ పేసర్ నసీం షా తోటి ప్లేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

తోటి ప్లేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన పాక్‌ పేసర్..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాక్‌ పేసర్ నసీం షా తోటి ప్లేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన సొంత ప్లేయర్‌నే బాడీ షేమింగ్ చేశాడు. లైవ్ మ్యాచ్‌లో బాడీ షేమింగ్ చేయడమే కాకుండా అతన్ని ఢీకొట్టాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖుల్నా టైగర్స్‌ తరఫున పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ మొయిన్‌ ఖాన్‌ తనయుడు ఆజం ఖాన్‌, కొమిల్లా విక్టోరియన్స్‌ తరఫున నసీం షా బరిలో​కి దిగారు.

కాగా ఆజం బ్యాటింగ్‌కు మైదానంలోకి వస్తుండగా నసీం అతనికి ఎదురెళ్లాడు. అతని బాడీని వెక్కిరించాడు. అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ఆజంఖాన్‌ను ఢీకొట్టి, అతని బాడీపై అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఇంత జరిగిన ఆజం ఖాన్ ఇవేమీ పట్టించుకోకుండా.. నసీం ను పక్కకు నెట్టేసి బ్యాటింగ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లతో పాటు పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా నసీం షాపై సోషల్‌ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

Next Story