బంగ్లాకు ముగ్గురు కెప్టెన్లు అవసరమా?.. అది నచ్చకే టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నా : శాంటో

by Harish |

బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి నజ్మల్ హుస్సేన్ శాంటో తప్పుకున్నాడు.

బంగ్లాకు ముగ్గురు కెప్టెన్లు అవసరమా?.. అది నచ్చకే టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నా : శాంటో
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి నజ్మల్ హుస్సేన్ శాంటో తప్పుకున్నాడు. శనివారం రెండో టెస్టులో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం శాంటో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శాంటో మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగడం నాకు ఇష్టం లేదు. అందరికీ ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇది వ్యక్తగత విషయం కాదు. జట్టు అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. జట్టుకు ఇది సహాయపడుతుందని నమ్ముతున్నా.’అని తెలిపాడు. ఈ సందర్భంగా శాంటో కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లా‌కు మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటాన్ని శాంటో తప్పుబట్టాడు. ఆ నిర్ణయం లాజిక్‌గా లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముగ్గురు కెప్టెన్లు ఉండటం జట్టుకు కష్టమని, అందుకే తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. శాంటో ఇటీవలే వన్డే కెప్టెన్‌గా తప్పుకోగా మెహిదీ హసన్ పగ్గాలు చేపట్టాడు. టీ20ల్లొ లిటాన్ దాస్ సారథ్యం వహిస్తున్నాడు. శాంటో నాయకత్వం వహించిన 14 టెస్టుల్లో బంగ్లాను నాలుగు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. పాకిస్తాన్‌పై చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని అందించాడు.


Next Story