- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ఓటమి.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న శాంటో!
బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (Najmul Hossain Shanto) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరుస వైఫల్యాలు క

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (Najmul Hossain Shanto) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరుస వైఫల్యాలు కారణంగా.. కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు బంగ్లా ( Bangladesh) స్టార్ ఆటగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో. తాజాగా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్ జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు.
ఇవాళ శ్రీలంక చేతిలో... బంగ్లాదేశ్ జట్టు దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో 78 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది శ్రీలంక. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 458 పరుగులు చేసింది. అటు బంగ్లాదేశ్ టీం.. మొదటి ఇన్నింగ్స్ లో 247 పరుగులు చేసింది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకు ఆల్ అవుట్ అయి.. మ్యాచ్ కోల్పోయింది.
ఇక ఇలాంటి నేపథ్యంలోనే... టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో. అటు రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో శ్రీలంక గెల్చుకుంది. ఇక అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడింది బంగ్లాదేశ్. ఇందులో నాలుగు మ్యాచులలో మాత్రమే గెలిచి మిగిలిన 9 మ్యాచ్ లు ఓడిపోయింది. ఇది ఇలా ఉండగా ఇటీవల వన్డే కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో స్థానంలో మోహిదీ హసన్ ఎంపికైన సంగతి తెలిసిందే.






