గుండె ఏ క్షణంలోనైనా.. భారత్, పాక్ మ్యాచ్‌పై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Harish |

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే.

గుండె ఏ క్షణంలోనైనా.. భారత్, పాక్ మ్యాచ్‌పై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. తిలక్ వర్మ సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు గుండె ఏ క్షణంలోనైనా పలుగుతుందేమో అనిపించిందని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘హార్ట్ బీట్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏ క్షణంలోనైనా పగులుతుందేమో అనిపించింది.’అని చెప్పాడు. అలాగే, భారత బ్యాటింగ్‌‌ను విశ్లేషించిన గవాస్కర్.. అభిషేక్, గిల్, సూర్యకుమార్ అనవసర షాట్లకు ప్రయత్నించి అవుటయ్యారని తెలిపాడు. ‘147 పెద్ద టార్గెట్ కాదు. కాబట్టి, ప్రతి బంతికి స్కోరు చేయాల్సిన అవసరం లేదు. మంచి ఆరంభం కావాలి. పవర్ ప్లేలో 50, 60 స్కోరే అవసరం లేదు. 35, 40 పరుగులు వచ్చినా చాలు. కానీ, 20 పరుగులకే 3 వికెట్లు పడటంతో పాక్‌‌కు గెలుపు తలుపులు తెరిచాయి.దీంతో అందరూ కంగారు పడ్డారు. బౌలర్ బాగా బౌలింగ్ చేసి అవుట్ చేస్తే అది విషయం కాదు. కానీ, బ్యాటర్లు అవసరం లేని షాట్లు ఆడాలని చూశారు. అదే టెన్షన్ పెట్టింది.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.


Next Story