ఆ పాక్ స్పిన్నర్ చిన్ననాటి హీరో కోహ్లీనట.. ఇంట్రెస్టింగ్ పోస్టు వైరల్

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ పాక్ స్పిన్నర్ చిన్ననాటి హీరో కోహ్లీనట.. ఇంట్రెస్టింగ్ పోస్టు వైరల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు. సాధారణ అభిమానులే కాదు.. క్రికెటర్లలో కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. విరాట్ తన చిన్ననాటి హీరో అని చెప్పాడు. కోహ్లీని ఉద్దేశించి అబ్రార్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ‘నా చిన్ననాటి హీరో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అతని ప్రశంసలకు కృతజ్ఞతలు. కోహ్లీ గొప్పతనం ఏంటంటే అతను కేవలం మ్యాచ్ సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మైదానంలోనే కాకుండా బయటా కూడా అతను స్ఫూర్తి నింపుతాడు.’అని రాసుకొచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయ శతకం బాది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆ మ్యాచ్‌లో అబ్రార్ అహ్మద్ ఓవరాక్షన్ చేసి విమర్శలకు గురయ్యాడు. శుభ్‌మన్ గిల్‌ను బౌల్డ్ చేసిన తర్వాత పెవిలియన్ వెళ్లాలంటూ అబ్రార్ చేసిన సైగలు చర్చకు దారితీయగా.. సొంత దేశ మాజీ క్రికెటర్లే అతని తీరుపై మండిపడ్డారు.


Next Story