MI vs DC : ముంబై vs ఢిల్లీ మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(MI vs DC) మధ్య మ్యాచ్ జరగబోతోంది.

MI vs DC : ముంబై vs ఢిల్లీ మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(MI vs DC) మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్(DC Captain Akshar Patel) అనారోగ్యం కారణంగా ఆటకు దూరం కాగా, అక్షర్ స్థానంలో డుప్లిసెస్(Du Plessis) కెప్టెన్సీగా ఉండబోతున్నాడు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియం(Wankhade Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై జట్టు బ్యాటింగ్ కు దిగనుంది.

కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ముంబై జట్టు 12 మ్యాచులు ఆడి 7 గెలవగా.. ఢిల్లీ 12 మ్యాచులు ఆడి 6 గెలచింది. ఇక టేబుల్ లో MI 4వ స్థానంలో ఉండగా DC 5వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ కు చేరాలంటే ఢిల్లీ ఈ మ్యాచులో గెలిచి తీరాల్సి ఉంది. ఇక ఈ ఆటకి వాన ఆటంకం తొలగినట్లు కనిపిస్తోందని సమాచారం.

Next Story