- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెలరేగిన రోహిత్, సూర్య... చెన్నైపై ముంబై విజయం
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. భయంకరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. భయంకరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ( CSK) చిత్తు చేసి... గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్ ( MI). ఆదివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది హార్దిక్ పాండ్యా సేన. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే సూర్య కుమార్ యాదవ్ ( suryakumar yadav ) ఇద్దరూ ప్రమాదకరంగా బ్యాటింగ్ చేయడంతో... ఒకే ఒక్క వికెట్ నష్టపోయి విజయం సాధించింది హార్దిక్ పాండ్యా సేన.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ నష్టపోయి 176 పరుగులు చేసింది. అయితే 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్... 15.4 ఓవర్లలోనే... ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ముంబై ప్లేయర్లలో... రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడమే కాకుండా 45 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి.
అటు సూర్య కుమార్ యాదవ్ 30 వంతులు 68 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 5 సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన విజయం సాధించిన ముంబై ఇండియన్స్... పాయింట్లు పట్టికలో ఆరవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్... నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.






