ఢిల్లీకి బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్‌ కు చేరిన ముంబై

by velandi.Saikiran |   (  Updated:2025-05-21 18:52:08  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో అందరూ ఊహించిందే జరిగింది. మొదట్లో విఫలమైన ముంబై ఇండియన్స్ క్రమక్రమంగా

ఢిల్లీకి బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్‌ కు చేరిన ముంబై
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో అందరూ ఊహించిందే జరిగింది. మొదట్లో విఫలమైన ముంబై ఇండియన్స్ క్రమక్రమంగా పుంజుకుంది. పుంజుకున్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు నేరుగా ప్లే ఆఫ్స్‌ కు వెళ్ళిపోయింది. ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏకంగా 59 పరుగులతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. ఈ దెబ్బకు ఐపీఎల్ 2025 టోర్నమెంటులో నాలుగోస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్... ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. అటు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇంటి దారి పట్టింది.

ప్లే ఆఫ్స్‌ కు వెళ్లిన జట్లు ఇవే

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో 10 జట్లు ఆడితే... నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇందులో మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉండగా, ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్.. నాలుగో స్థానాన్ని ఫిక్స్ చేసుకుంది. అయితే మరికొన్ని లీగ్ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో... ఈ నాలుగు జట్ల స్థానాలు అటు ఇటుగా అవుతాయి. ఇందులో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన.. ఎలిమినేషన్ రౌండ్ లో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకే ప్రయత్నం చేస్తున్నాయి.

Next Story