- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లే ఆఫ్స్ కు ముంబై.. వణికిపోతున్న RCB.. ఇక కష్టమే ?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ప్లే ఆఫ్స్ (

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ప్లే ఆఫ్స్ ( Play offs)చేరుకుంది. బుధవారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ( Dc) మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా ముంబై ఇండియన్స్ ఆ లిస్టులోకి చేరిపోయింది. అయితే లీగ్ దశలో... ప్లే ఆఫ్స్ వెళ్లిన జట్లు మరికొన్ని మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అప్పుడే... మొదటి స్థానం నుంచి నాలుగో స్థానం వరకు ఏ జట్టు ఏ స్థానంలో ఉండాలే అనేది క్లారిటీ వస్తుంది. అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడంతో.... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కాస్త టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలని.. బెంగళూరు చాలా కసిగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ లోకి వస్తే అవలీలగా ఫైనల్ వెళ్లి కప్ గెలుస్తామని బెంగళూరు అభిమానులు, యాజమాన్యం, అటు ప్లేయర్స్ ఓ అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముంబై ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టిందంటే.. వాళ్లను ఆపడం చాలా కష్టం. కప్ కచ్చితంగా తీసుకువెళ్తారు. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకే బెంగళూరు అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.






