- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఎందుకో తెలుసా?
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది.

దిశ, స్పోర్ట్స్ : ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. క్రికెట్ బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. వాంఖడే క్రికెట్ స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంసీఏ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ స్టేడియంలో 1975లో జనవరి 23 నుంచి 29 వరకు తొలి మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో భారత్, వెస్టిండీస్ తలపడ్డాయి. వాంఖడే గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరిగి సరిగ్గా గురువారం నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని వాంఖడే స్టేడియంలో 14,505 బంతులను ఉపయోగించి ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’ అని రాశారు. ఈ వాక్యం రాయడానికి ఎరుపు, తెలుపు బంతులను ఉపయోగించారు. విండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మాజీ క్రికెటర్, దివంగత ఏక్‌నాథ్ సోల్కర్ సెంచరీ చేశాడు. ఏక్‌నాథ్ సోల్కర్, మాజీ ముంబై ఆటగాళ్ల స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్ తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన బంతులను స్కూళ్లు, క్లబ్‌లు, ఎన్జీవోలకు చెందిన యువ క్రికెటర్లకు ఇవ్వనున్నట్టు చెప్పారు.






