ఇన్‌ఫ్లుయెన్సర్ గిల్ కేసులో క్రికెటర్ పృథ్వీ షాకి రూ. 100 ఫైన్ వేసిన కోర్టు

by Malleboina Mahesh |

క్రికెటర్ పృథ్వీ షా పై రెండు సంవత్సరాల క్రితం ముంబైలో సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇన్‌ఫ్లుయెన్సర్ గిల్ కేసులో క్రికెటర్ పృథ్వీ షాకి రూ. 100 ఫైన్ వేసిన కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెటర్ పృథ్వీ షా (Cricketer Prithvi Shaw) పై రెండు సంవత్సరాల క్రితం ముంబైలో సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంధేరీలోని ఒక పబ్‌లో 2023 ఫిబ్రవరి 15న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ (Influencer Sapna Gill), తన అభిమాన క్రికెటర్ పృథ్వీ షా తో సెల్ఫీ తీసుకోవాలని కోరింది. అయితే, ఆ సందర్భంలో వాగ్వాదం చెలరేగి, తన స్నేహితుల పై దాడి చేసి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి పృథ్వీ షా పై సంచలన ఆరోపణలు చేసింది. అలాగే పోలీసులను సైతం ఆశ్రయించింది. అయితే ఆమె ఆరోపణల్లో నిజం లేకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

దీంతో నిరాశ చెందిన యువతి.. నేరుగా అంధేరీ కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు క్రికెటర్ పృథ్వీ షాకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికి అతని నుంచి ఎటువంటి కౌంటర్ పిటిషన్ దాఖలు కాలేదు. దీంతో అసహనానికి గురైన కోర్టుల.. పృథ్వీ షాపై రూ.100 జరిమానా (Rs.100 fine) విధించింది. అలాగే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం కల్పించింది. ఈ పరిణామంతో కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు షా సమాధానం ఇస్తారా? లేక కేసు కొత్త దిశలో వెళ్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Next Story