- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు పెట్టుకో.. కర్మ వదిలిపెట్టదు...గంభీర్ కు టీమిండియా ప్లేయర్ వార్నింగ్ !
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరికొన్ని గంటల్లోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ పూర్తికాగానే... వెంటనే ఇంగ్లాం

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరికొన్ని గంటల్లోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ పూర్తికాగానే... వెంటనే ఇంగ్లాండ్ వచ్చేసింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య... ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే.. శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ ముఖేష్ కుమార్ సంచలన పోస్ట్ పెట్టారు.
ఇప్పుడు అతడు పెట్టిన పోస్ట్.. హాట్ టాపిక్ అయింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ... వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. కర్మ సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది... అది ఎవరిని క్షమించదు.. ఏ క్షణమైనా ప్రతికాలం తీర్చుకుంటుంది అంటూ రాసుకొచ్చాడు. అయితే... ముఖేష్ కుమార్ చేసిన పోస్ట్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి.. ఉంటుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
సరిగ్గా ఎకనామీ లేకున్నా కూడా ఇంగ్లాండ్ సిరీస్ కోసం హర్షిత్ రానా ను బరిలోకి దింపాడు గౌతమ్ గంభీర్. కానీ ముఖేష్ కుమార్ ను... ఇంగ్లాండ్ సిరీస్ కోసం తీసుకోలేదు. అందుకే గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి ముఖేష్ కుమార్... అలాంటి పోస్ట్ పెట్టాడని కొంతమంది అంటున్నారు. ఇది ఇలా ఉండగా, 19 ప్లేయర్ గా హర్షిత్ రానా ను బరిలోకి దింపాడు గౌతమ్ గంభీర్.






