ఐపీఎల్‌లో MS ధోనీ అరుదైన రికార్డు

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) అరుదైన ఘనత సాధించారు.

ఐపీఎల్‌లో MS ధోనీ అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో 200 సిక్సులు కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. అది కూడా 30 ఏళ్లు దాటిన తర్వాత కొట్టడం విశేషం. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో ధోనీ సిక్స్‌ కొట్టి 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరారు. ఇక ఓవరాల్‌గా అయితే.. 347 సిక్సులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నారు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఎమ్ఎస్ ధోనీ 267 మ్యాచులు ఆడారు. మొత్తంగా 5289 వేల రన్స్ చేశారు. 24 హాఫ్ సెంచరీలు చేశారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టులో ఎమ్ఎస్ ధోనీ కీలకంగా ఉన్నారు.

Next Story