CSK మ్యాచ్ కు ధోని పేరెంట్స్.. రిటైర్మెంట్ అంటూ వార్తలు ! !

by velandi.Saikiran |   (  Updated:2025-04-09 16:02:02  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూసేందుకు

CSK మ్యాచ్ కు ధోని పేరెంట్స్.. రిటైర్మెంట్ అంటూ వార్తలు !   !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూసేందుకు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) తల్లి దండ్రులు ( Parents ) వచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) జట్ల మధ్య మ్యాచ్ చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హోం గ్రౌండ్ కు రావడంతో... భారీ క్రౌడ్ తో పాటు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) పేరెంట్స్ కూడా వచ్చారు.

వాస్తవానికి మహేంద్రసింగ్ ధోని పేరెంట్స్.. పెద్దగా స్టేడియాలలో కనిపించరు. కేవలం మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ( Sakshi ), అలాగే ఆయన కూతురు మాత్రమే... క్రికెట్ స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ తిలకిస్తూ ఉంటారు. కానీ లేటెస్ట్ గా.. మహేంద్రసింగ్ ధోని పేరెంట్స్... స్టేడియం లో మెరిశారు. మహేంద్ర సింగ్ ధోని తల్లి సింపుల్ గా.. నార్మల్ శారీలో కనిపించగా... ఆయన తండ్రి లాల్చీలో మెరిసారు. వైట్ క్యాప్ పెట్టుకొని... కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ధోని పేరెంట్స్..మ్యాచ్ కు రావడంతో నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంటున్నారు. ఇది ఇలా ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన.. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసేందుకే నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్.

👉Click For Tweet..

Next Story