- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే జరిగితే, ధోని రిటైర్మెంట్ ఇస్తాడు - అశ్విన్
ధోని తానే స్వయంగా రిటైర్ అవుతాడు.అనవసరంగా అతని గురించి మాట్లాడొద్దని ABD పై రవిచంద్రన్ అశ్విన్ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ధోని ( MS Dhoni) రిటైర్మెంట్ పై రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ గురించి ఎవరు మాట్లాడకూడదని.. ధోనినే దానిపైన నిర్ణయం తీసుకుంటాడని వెల్లడించారు అశ్విన్. చెన్నై సూపర్ కింగ్స్ కు తన అవసరం లేదనుకుంటే డకౌట్ లో ధోని కూర్చుంటాడని ఏబీ డివిలియర్స్ (AB de Villiers ) వెల్లడించారు. అతని స్థానంలో మరో కుర్రాడికి ఛాన్స్ ఇస్తారని తెలిపారు.
అయితే ఏబీ డివిలియర్స్ చేసిన ఈ వ్యాఖ్యలపై అశ్విన్ కౌంటర్ ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ కు తన సేవలు అవసరం లేదని ధోని భావిస్తే, స్వయంగా తానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అశ్విన్ తెలిపారు. కానీ జట్టులోనే ఉండి కుర్ర క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోడని తెలిపారు. ఈ రిటైర్మెంట్ పైన ధోనినే నిర్ణయం తీసుకోవాలని.. ఎవరు కూడా అతనిపై ఒత్తిడి తేకూడదని సూచనలు చేశారు. అలాంటోడు జట్టులో ఉంటే 1000 ఏనుగుల బలమే అంటూ కితాబు ఇచ్చారు.






