- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎస్కే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గాయం
ఐపీఎల్-2026 ప్రారంభం వేళ సీఎస్కే ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లుగా పేర్కొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నీ మొదటి 2 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ధోనీ పిక్క కండరాల గాయానికి (Calf Strain) గురైనట్లుగా సమాచారం. దీంతో ఆయన కనీసం 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ధోనీ ఐపీఎల్ 2026 మొదటి 2వారాల మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ తలా’ అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎస్కే పోస్ట్ చేసింది.
అదే జరిగితే, ధోని రిటైర్మెంట్ ఇస్తాడు - అశ్విన్
Next Story






