- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CSK ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ ధోనికి కెప్టెన్సీ
మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా

దిశ, వెబ్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మరోసారి మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న రుతురాజు గైక్వాడ్ కు ( Ruturaj Gaikwad) గాయమైంది. అతని మోచేతికి గాయం కావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో మహేంద్రసింగ్ ధోనీకి మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు కాసేపటి క్రితమే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ( Stephen Fleming ) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) టోర్నీ మొత్తానికి కెప్టెన్ గా వ్యవహరిస్తాడా..? మధ్యలోనే రుతురాజు జట్టులో చేరుతాడా అనేది తెలియాల్సి ఉంది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨𝑩𝒊𝒈 𝒃𝒍𝒐𝒘 𝒇𝒐𝒓 𝑪𝑺𝑲! 😢Skipper Ruturaj Gaikwad has been ruled out of IPL 2025 due to an elbow fracture, and MS Dhoni will lead the side in his absence 💛🤝#MSDhoni #RuturajGaikwad #IPL2025 #CSK #Sportskeeda pic.twitter.com/4dlxwQajur— Sportskeeda (@Sportskeeda) April 10, 2025






