- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కడం జీవితాంతం గుర్తుంచుకుంటా: ధోనీ
by Phanindra |
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కడం జీవితాంతం గుర్తుంచుకుంటానని ధోనీ చెప్పాడు. భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న 11వ ప్లేయర్ ధోనీ.

X
దిశ, స్పోర్ట్స్: లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కింది. భారత్ నుంచి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న 11వ క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. దీనిపై స్పందించిన కెప్టెన్ కూల్.. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో చోటు దక్కడం చాలా గొప్ప గౌరవం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు గొప్ప సేవ చేసిన ప్లేయర్లకు దక్కే గౌరవం ఇది. ఆ లిస్టులో ఉండే హేమాహేమీల సరసన నా పేరు చేరడం, వారితోపాటు నన్నూ గుర్తించడం అద్భుతమైన అనుభూతి. జీవితాంతం దీన్ని గుర్తుంచుకుంటా’ అని చెప్పాడు. ధోనీకంటే ముందు నీతూ డేవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, డైన ఎడుల్జీ, వినో మన్కడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్ ఈ గౌరవం పొందారు.
Next Story






