Ms Dhoni: ధోనికి ఘోర అవ‌మానం...ఖైదీ జెర్సీతో ఫోటోలు !

by velandi.Saikiran |

Ms Dhoni: ధోనికి ఘోర అవ‌మానం...ఖైదీ జెర్సీతో ఫోటోలు !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ మ‌హేంద్ర సింగ్ ధోని...గురించి ప్ర‌త్యేకంగా తెలియ‌ని వారుండ‌రు. టీమిండియాకు ఎన్నో టోర్న‌మెంట్లు అందించిన ధోని... చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కూడా 5 టోర్నీలు అందించారు. అయితే.. అలాంటి ధోనిపై కొంత మంది విషం క‌క్కుతున్నారు. చాలా మంది ప్లేయ‌ర్ల జీవితాల‌ను నాశ‌నం చేశాడ‌ని కూడా కొంత మంది మాజీలు ఆరోపణ‌లు చేస్తున్నారు.

ఇక ఈ త‌రుణంలోనే... ధోనికి ఖైదీ జెర్సీ వేసి.. కొన్ని ఫోటోలు వైర‌ల్ చేస్తున్నారు. జెమినీ అనే ఏఐ లో కొత్త అప్డేట్ వ‌చ్చింది. ఈ త‌రుణంలోనే....ఆ టెక్నిక్ వాడి... ధోనికి ఖైదీ జెర్సీ వేసి.. కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి.. వైర‌ల్ చేస్తున్నారు. గ‌తంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డిన నేప‌థ్యంలో... ఆ జ‌ట్టుపై బ్యాన్ విధించారు. దీనికి కారణం ధోనినే అని...అందుకే ఖైదీ జెర్సీ వేసి ఫోటోలు పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన ధోని ఫ్యాన్స్‌...కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇదంతా ఆర్సీబీ ఫ్యాన్స్ ప‌నేన‌ని...కౌంట‌ర్ ఇస్తున్నారు.

Next Story