- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ పై ధోని కీలక వ్యాఖ్యలు
భారత మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని (MS Dhoni) ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Retirement for all formats) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది సీజన్లుగా చెన్నై జట్టులో ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతున్న ధోని ఫామ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ (Retirement from IPL) తీసుకుంటాడని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా 2025 సీజన్ లో ధోనిని అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై తిరిగి రిటైన్ చేసుకుంది. కానీ CSK కెప్టెన్ గా మాత్రం గైక్వాడ్ కు అవకాశం ఇచ్చింది. గత సీజన్లో జడేజా కెప్టెన్ గా వ్యవహరించి.. వరుస ఓటములు తర్వాత ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సీజన్‌లో కూడా గైక్వాడ్ సారధ్యంలో జట్టు వరుస ఓటములు చవిచూసింది. అనంతరం అతను గాయం కారణంగా మ్యాచులకు దూరం కాగా మరోసారి ధోని చెన్నై పగ్గాలు చేపట్టారు. దీంతో ఈ సీజన్ ధోనికి లాస్ట్ అని, వచ్చే సీజన్ ఆడే అవకాశం లేదంటూ విశ్లేషకులు అంచనా వేశారు. అలంటీ వార్తలపై ధోని (MS Dhoni) క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్ల వయసులో నా కెరీర్ చివరి దశలో ఉందని నాకు తెలుసు. ఐపీఎల్ 2026 లో తిరిగి వస్తానో లేదో నిర్ణయించుకోవడం చాలా తొందరగా ఉంది.
కానీ అభిమానుల నుంచి లభించిన ప్రేమ, ఆప్యాయత అద్భుతంగా ఉందని, వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటంపై దృష్టి ఉందని అన్నారు. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడి పనిచేసిన తర్వాత, తన శరీరం చిన్న ఫార్మాట్ డిమాండ్లను తట్టుకోగలదా అని అంచనా వేసిన తర్వాత తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ధోని చెప్పుకొచ్చాడు. దీంతో మైదానంలో ఉన్న అభిమానులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.






