- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్-2026 కోసం సాధన మొదలుపెట్టాడు. వచ్చే సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా రిలీజ్ కానప్పటికీ మార్చి ఆఖర్లో టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ ఆరంభానికి రెండు నెలల ముందుగానే 44 ఏళ్ల ధోనీ రాంచీలో ప్రాక్టీస్ షురూ చేశాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఎల్లో కలర్స్‌లో ఉన్న ప్యాడ్స్ కట్టుకున్నాడు ధోనీ. నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ) సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ పోస్టుకు ‘ఎవరు తిరిగి వచ్చారో చూడండి. జేఎస్‌సీఏ గర్వకారణం. మహేంద్ర సింగ్ ధోనీ’అని రాసుకొచ్చింది. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, గత రెండు, మూడు సీజన్లుగా అతని రిటైర్మెంట్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా ధోనీకి ఐపీఎల్-2026 చివరిదంటూ ప్రచారం జరుగుతోంది. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ధోనీ 13 ఇన్నింగ్స్‌ల్లో 196 రన్స్ చేశాడు.






