MS ధోనికి కొత్త బిరుదు...ఇక చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది

by velandi.Saikiran |

కెప్టెన్ ఐసీసీ ట్రిపుల్ ట్రోఫీ విన్నర్ అంటూ ధోనీకి కొత్త బిరుదు ఇచ్చారు. ఇదే పేరును శిలాఫలకాలపై రాయించారు.

MS ధోనికి కొత్త బిరుదు...ఇక చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటేనే ఒక బ్రాండ్. టీమిండియాకు మూడు ఐసీసీ టోర్నమెంట్లు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అలాంటి ధోని, అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. దీనికి నిదర్శనమే ఐపీఎల్ టోర్నమెంట్. తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని పదేపదే అంటున్నా, చెన్నై యాజమాన్యం అతన్ని బతిలాడి మరీ ఐపిఎల్ ఆడిస్తోంది. అలాంటి మహేంద్ర సింగ్ ధోని తాజాగా మధురైలో మెరిసారు.

ఈ సందర్భంగా మధురై అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ( Velammal Cricket Stadium) ప్రారంభించారు ధోని. దీంతో నిన్నటి నుంచి ధోని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అంతేకాదు ఈ స్టేడియం ఓపెనింగ్ సందర్భంగా ధోని పేరును శిలాఫలకాలపై అద్భుతంగా రాయించారు. సాధారణంగా అందరూ మిస్టర్ కూల్ ధోని పేరు సింపుల్ గా రాస్తారు.

కానీ వీళ్లు కెప్టెన్ ఐసీసీ ట్రిపుల్ ట్రోఫీ విన్నర్ అంటూ ధోనీకి కొత్త బిరుదు ఇచ్చారు. ఇదే పేరును శిలాఫలకాలపై రాయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మిస్టర్ కూల్ ఇప్పుడు ఐసీసీ ట్రిపుల్ ట్రోఫీ విన్నర్ అయిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై అతన్ని అలానే పిలుస్తామని పేర్కొంటున్నారు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ టీమిండియాకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక్కడ క్లిక్ చేయండి



Next Story