- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో MS ధోని.. వీడియో వైరల్
7పాడెల్ కోర్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనిరుద్,ధోని ఈ సందర్భంగా ఈ కోర్ట్ ను ధోని చేతిలో మీదుగా లాంచ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni) గురించి తెలియని వారు ఉండరు. మహేంద్ర సింగ్ ధోనీకి అలాగే చెన్నై నగరానికి మంచి అనుబంధము ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ధోని. దీంతో చెన్నైని తన సెకండ్ హోంగా మార్చుకున్నాడు.
అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు మహేంద్ర సింగ్. 7పాడెల్ కోర్ట్ ను పాలవక్కం అనే ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, మహేంద్ర సింగ్ ధోని అలాగే రుతురాజు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఈ కోర్ట్ ను ధోని చేతిలో మీదుగా లాంచ్ చేశారు.
అనంతరం కూలి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ , మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు కలిసి పాడెల్ ఆడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కూలి సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ధోనితో కలిసి అనిరుద్ మ్యాజిక్ చేశాడని అంటున్నారు.
Instagramme Link






