- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS DHONI: ఇలాంటి భయంకరమైన జట్టును చూడలేదు..భారత జట్టుపై ప్రశంసలు
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ పైన మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టుపై మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భయంకరమైన భారత జట్టును గతంలో ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు ధోని. దీంతో ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.
టీమిండియాపై ధోని ప్రశంసలు
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ పైన మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు తయారైందని కితాబు ఇచ్చారు. ఇది ఊపు కొనసాగిస్తే ఖచ్చితంగా ఛాంపియన్ గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించ గల జట్టుగా భారత టీం తయారైందని వ్యాఖ్యానించారు. అయితే పొగ మంచు ఒక్కటే విలన్ గా మారే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఆ పొగ మంచును మ్యానేజ్ చేసుకొని.. ముందుకు వెళ్లారన్నారు. అలాగే ఈ టి20 వరల్డ్ కప్ లో టాస్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు మహేంద్రసింగ్ ధోని. దీంతో ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.






