- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీ రికార్డు గల్లంతు.. మాహీని వెనక్కినెట్టిన జడేజా
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. 176 బంతుల్లో 104 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టిన జడేజా టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ప్లేయర్ల జాబితాలో 4వ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ధోనీని వెనక్కినెట్టాడు. ధోనీ 78 సిక్స్‌లు బాదాగా.. జడేజా తాజాగా కొట్టిన ఐదు సిక్సర్లతో 80 సిక్స్‌లు నమోదు చేశాడు. ఇక, అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్(90), రోహిత్(88) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గాయం కారణంగా పంత్ విండీస్ టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇక, మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. అతను 136 సిక్స్‌లు బాదాడు.






