గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీ ముందు దేనికి ప‌నికిరాడు !

by velandi.Saikiran |

గిల్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ (Monty Panesar) ఫైర్ అయ్యారు. గిల్ చాలా బద్దకస్తుడు అంటూ నిప్పులు చెరిగార

గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీ ముందు దేనికి ప‌నికిరాడు !
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అతని ఫామ్ పైన మాజీ క్రికెటర్లందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అతని కెప్టెన్సీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గిల్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ (Monty Panesar) ఫైర్ అయ్యారు. గిల్ చాలా బద్దకస్తుడు అంటూ నిప్పులు చెరిగారు.

విరాట్ కోహ్లీ ముందు ఏ మాత్రం పనికిరాడు అంటూ మండిపడ్డారు. కోహ్లీ చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని, గిల్ మాత్రం అలా ఉండడని విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం గిల్ చేత కాదన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెటర్ లో ఆడాలని సూచనలు చేశారు. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం మాత్రమే ప్లేయర్లు మ్యాచ్ లు ఆడుతున్నారని చురకలు అంటించారు. టీమిండియా వన్డే, టెస్టుల్లో కోహ్లీ లేకపోవడం వల్ల ఆ జట్టు ఓడిపోతుందని వివరించారు మాంటి పనేసర్.

Next Story