బంగ్లాదేశ్ కు ఘోర అవమానం జరిగింది..న‌ఖ్వీ సంచలనం

by velandi.Saikiran |

ఇండియా కోసమే ఐసీసీ పనిచేస్తుందని, మిగ‌తా క్రికెట్ బోర్డులు అవసరం లేదా ? అంటూ నిలదీశారు న‌ఖ్వీ.

బంగ్లాదేశ్ కు ఘోర అవమానం జరిగింది..న‌ఖ్వీ సంచలనం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ న‌ఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. ఇండియా కోసం బంగ్లాదేశ్ ను నట్టేట ముంచింది ఐసీసీ అని నిప్పులు చెరిగారు. ఇండియా, పాకిస్తాన్ కోసం వేదికలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం మీరెందుకు మార్చరు ? ఇదేనా సమన్యాయం అంటూ ఐసీసీనీ కడిగిపారేశారు న‌ఖ్వీ.

ఇండియా కోసమే ఐసీసీ పనిచేస్తుందని, మిగ‌తా క్రికెట్ బోర్డులు అవసరం లేదా ? అంటూ నిలదీశారు. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అంటూ హితువు పలికారు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండకూడదని... అందుకే తాము బంగ్లాదేశ్ కు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కాగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ వస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Next Story