బంగ్లాదేశ్ వివాదం..ఐసీసీకి పాకిస్తాన్ సంచ‌ల‌న లేఖ !

by velandi.Saikiran |

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్, బంగ్లాదేశ్ ఎపిసోడ్ నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపింది.

బంగ్లాదేశ్ వివాదం..ఐసీసీకి పాకిస్తాన్ సంచ‌ల‌న లేఖ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో భార‌త్ లో ప‌ర్య‌టించ‌బోమంటూ బంగ్లా పదేపదే స్పష్టం చేస్తోంది. సెక్యూరిటీ సమస్యలు చూపించి మరీ.. ఇండియాను కించపరుస్తూ వ్యవహరిస్తోంది. వేదికలు మార్చితేనే టోర్నమెంట్ ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ తోక పట్టుకొని నడుస్తోంది.

ఐసీసీకి లేఖ రాసిన పాకిస్తాన్

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్, బంగ్లాదేశ్ ఎపిసోడ్ నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపింది. బంగ్లాదేశ్ అడిగినట్లు.. అన్ని డిమాండ్లు పరిష్కరించాలని ఐసీసీకి లేఖ రాసింది పాకిస్తాన్. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా శ్రీలంకకు బంగ్లాదేశ్ వేదికలను మార్చాలని కోరింది. ఇండియా కోసం ఐసీసీ అస్సలు తలొగ్గద్దని వెల్లడించింది పాకిస్తాన్. ఈ మెరుపు ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ లేఖ‌ రాశారు. కాగా ఈరోజు సాయంత్రం లోపు టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడంపై క్లారిటీ ఇవ్వాలని బంగ్లాదేశ్ కు ఐసీసీ డెడ్ లైన్ పెట్టింది.

Next Story