హర్షిత్ రాణా ఔట్.. అనూహ్యంగా ప్రపంచకప్‌కు ఎంపికైన సిరాజ్

by Harish |

హర్షిత్ రాణా ఔట్.. అనూహ్యంగా ప్రపంచకప్‌కు ఎంపికైన సిరాజ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ పేసర్ హర్షిత్ రాణా టీ20 వరల్డ్ కప్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా అతను మెగా ఈవెంట్‌‌‌‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ మోకాలికి గాయమైంది. ఆ మ్యాచ్‌లో హర్షిత్ ఒకే ఓవర్ మాత్రమే వేసి 16 రన్స్ ఇచ్చాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రపంచకప్‌కు అతను అన్‌ఫిట్ అని తెలిపినట్టు బోర్డు పేర్కొంది. అలాగే, అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసింది. టీ20లకు దూరంగా ఉంటున్న సిరాజ్ 2024‌ జూలైలో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు.


Next Story