డియర్ డియాగో.. లార్డ్స్ టెస్టులో నివాళులర్పించిన సిరాజ్!

by Phanindra |   (  Updated:2025-07-11 20:08:13  IST  )

డియర్ డియాగో.. ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన ఫుట్‌బాల్ స్టార్‌కు సిరాజ్ నివాళులర్పించాడు.

డియర్ డియాగో.. లార్డ్స్ టెస్టులో నివాళులర్పించిన సిరాజ్!
X

దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో బంతితో రాణించిన టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇటీవలే కారు ప్రమాదంలో మరణించిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ స్టార్ డియాగో జోటాకు నివాళులర్పించాడు. ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్‌ను అవుట్ చేసిన సిరాజ్.. చేతి వేళ్లతో 20 నెంబర్ చూపించి, ఆకాశం వైపు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. జోటా జెర్సీ నెంబర్ కూడా 20 కావడం గమనార్హం. ఇలా జోటాకు సిరాజ్ నివాళులర్పించడాన్ని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఈ మ్యాచులో 23.3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ రెండు కీలకమైన వికెట్లు తీసుకొని రాణించాడు.

Next Story