బుమ్రా కొంపముంచుతున్న సిరాజ్.. ఈ లెక్కలు షాక్ అవ్వాల్సిందే

by velandi.Saikiran |   (  Updated:2025-08-02 08:41:13  IST  )

టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోతున్నాడు. అందిన

బుమ్రా కొంపముంచుతున్న సిరాజ్.. ఈ లెక్కలు షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోతున్నాడు. అందిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదు మహమ్మద్ సిరాజ్. ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా రెచ్చిపోతాడు అనుకుంటే.... మహమ్మద్ సిరాజ్ దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటివరకు మొత్తం 18 వికెట్లు పడగొట్టి.... లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు సిరాజ్.

ఈ నేపథ్యంలోనే బుమ్రా ప్లేస్ కు ఎసరు పెడుతున్నాడు మహమ్మద్ సిరాజ్. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కలిసి ఆడిన మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. ఇందులో సిరాజ్ యావరేజ్ 61.28 గా ఉంది. ఇక అదే సమయంలో... బుమ్రా ఆడకుండా కేవలం మహమ్మద్ సిరాజు మ్యాచ్ ఆడితే.... పరిస్థితి వేరేలా ఉంది. అలా ఆడిన అనే పద్యంలో మూడు ఇన్నింగ్స్ లలో ఏకంగా 11 వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. ఇందులో 19.36 ఎకానమీ ఉంది. అలాగే ఎలాంటి గాయాలు లేకుండా... ప్రతి సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ తన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో బుమ్రా స్థానం గల్లంతు అవుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Next Story