Mohammed Siraj: ఇంగ్లాండ్ గడ్డపై సిరాజ్ హిస్టరీ.. ఏకంగా 200 !

by velandi.Saikiran |

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (MOHAMMED SIRAJ ) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో

Mohammed Siraj: ఇంగ్లాండ్ గడ్డపై సిరాజ్ హిస్టరీ.. ఏకంగా 200 !
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (MOHAMMED SIRAJ ) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 200 వికెట్లు పడగొట్టి... చరిత్ర సృష్టించాడు హైదరాబాద్ స్పీడ్ బౌలర్ సిరాజ్. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

లండన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 224 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.

అయితే ఈ సందర్భంగా... ఇంగ్లాండ్ ఆటగాడు పోప్ వికెట్ ను ( Ollie Pope) ఇవాళ సిరాజ్ పడగొట్టాడు. దీంతో తన కెరియర్ లో 200 వికెట్లు తీసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు సిరాజ్. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం 31 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్... మూడు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం రూట్ అలాగే బ్రూక్ బ్యాటింగ్ చేస్తున్నారు.

MOHAMMED SIRAJ COMPLETED 200 WICKETS IN INTERNATIONAL CRICKET

Next Story