గుజరాత్‌పై ఫైఫర్‌తో సెలెక్టర్లకు షమీ మెసేజ్..!

by Phanindra |

గుజరాత్‌పై ఫైఫర్‌తో సెలెక్టర్లకు షమీ మెసేజ్ పంపాడు. తను ఫుల్ ఫిట్‌గా, ఫామ్‌లో ఉన్నట్లు స్పష్టంచేశాడు.

గుజరాత్‌పై ఫైఫర్‌తో సెలెక్టర్లకు షమీ మెసేజ్..!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియాకు ఎంపికవ్వని మహమ్మద్ షమీ.. తన ఆటతోనే సెలెక్టర్లకు దిమ్మతిరిగే బదులిచ్చాడు. 11 నెలల గ్యాప్ తర్వాత క్రికెట్ ఆడుతున్న షమీ.. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో మూడు వికెట్లతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్సులో కేవలం 38 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ సూపర్ బౌలింగ్‌తో సెంచరీతో మెరిసిన గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ (109)ను కూడా పెవిలియన్ చేర్చాడు. అతనితోపాటు షెహబాజ్ అహ్మద్ కూడా రాణించడంతో బెంగాల్ ఏకంగా 141 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ ప్రదర్శన తర్వాత టీమిండియా రీఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన అతను.. ఎలాంటి కాంట్రవర్సీలు తనకు అక్కర్లేదన్నాడు. ‘మీ వల్ల నేను ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటాను. అది జస్ట్ ఒక మిసండర్‌స్టాండింగ్ అంతే. మధ్యప్రదేశ్‌పై 11 నెలల క్రితం నేను క్రికెట్ ఆడా. మళ్లీ ఇప్పుడే ఆడుతున్నా. దేశంలో అందరూ టీమిండియాకు ఆడాలనే అనుకుంటారు. నేను కూడా దానికి రెడీగానే ఉన్నా. ఫిట్‌గా ఉండి, టీమిండియాకు అందుబాటులో ఉండాలనేదే నా మోటివేషన్. మైదానంలో రాణిస్తూనే ఉంటా.. ఇక మిగతాది సెలెక్టర్లు చేతిలో ఉంది’ అని తేల్చిచెప్పాడు.

Next Story