- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి టెస్టులో టీమిండియా బౌలింగ్‌పై షమీ అసంతృప్తి
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పరాజయంపై భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పరాజయంపై భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించాడు. భారత్ బౌలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే ఓడిపోయామని చెప్పాడు. ‘బుమ్రా నుంచి ఇతర బౌలర్లు నేర్చుకోవాలి. ప్లానింగ్ గురించి అతనితో మాట్లాడండి. అతనికి సహకరించండి. మిగతా బౌలర్లు బుమ్రాకు సహకరిస్తే మనం సులభంగా గెలుస్తాం. తొలి టెస్టు గురించి మాట్లాడాలంటే మనం బౌలింగ్‌పై పనిచేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. కొత్త బంతితో వికెట్లు తీయడం చాలా కీలకం. మనం ఎక్కువ పరుగులు ఇవ్వడం వల్లే ఇంగ్లాండ్ తొలి టెస్టులో గెలిచింది. మన బౌలింగ్‌ను ఎలా పటిష్టంగా తయారు చేసుకోవాలి మనం తెలుసుకోవాలి.’అని షమీ చెప్పుకొచ్చాడు.






