- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా వాళ్లకు ఎలా ఆడాలో తెలియదు.. ఇంకా చాలా నేర్చుకోవాలి’: పాక్ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్(Asia Cup Final Match)లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) అదరగొట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్(Asia Cup Final Match)లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) అదరగొట్టిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో పాకిస్తాన్(Pakistan)పై భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా తిలక్ వర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్(Mohammad Amir) ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిడిలో కూడా తిలక్ అద్భుతంగా రాణించారని అన్నారు. భారత జట్టు టాప్ ఆర్డర్ విఫలమైన వేళ తిలక్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి.. ఇండియాకు ఆసియా కప్ అందించారని కొనియాడారు. అతనికి పాకిస్తాన్‌పై గెలవాలనే కసితో పాటు ఆట మీద సంపూర్ణ అవగాహన కూడా ఉందని అన్నారు. పాకిస్తాన్ బ్యాటర్లు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ షాట్ ఆడాలో ఇంకా పూర్తిగా తెలియడం లేదు. తిలక్ స్మార్ట్ క్రికెట్ ఆడారు. అదే క్రమంలో జట్టుకు విజయాన్ని అందించి హీరోగా నిలిచారని అమీర్ ప్రశంసించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.






