- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Modi: వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోడీ ప్రశంసలు
ఐపీఎల్‌లో తన ఆటతో అదరగొడుతున్న 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav surya vamshi)పై ప్రధాని మోడీ(Modi) ప్రశంలు కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో తన ఆటతో అదరగొడుతున్న 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav surya vamshi)పై ప్రధాని మోడీ(Modi) ప్రశంసలు కురిపించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ బిడ్డ వైభవ్ సూర్య వంశీ చిన్న వయసులోనే అద్భుతంగా ఆడుతున్నాడని అన్నారు. అంత చిన్నవయసులో రికార్డులు సృష్టిస్తున్నాడని ప్రశంసించారు. దేశంలో స్పోర్ట్స్ కల్చర్ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.
ఆటలు ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. క్రీడల ద్వారా తమలో ఉన్న టాలెంట్ బయటపడుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే వైభవ్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఐపీఎల్ ఆడుతున్నాడు. మొన్నటి మ్యాచ్‌లో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దీంతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అతడి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఒక్కరాత్రిలోనే డబుల్ అయ్యింది. న్యూస్‌లో రెండు రోజుల పాటూ హెడ్ లైన్స్‌లో నిలిచాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వస్తుందంటే వైభవ్ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.






