- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BCCI కొత్త అధ్యక్షుడిగా కోహ్లీ కెప్టెన్..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా (Rajiv Shukla) పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ అతను ఇంటరిమ్ గా ఆ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు (BCCI President) ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో (BCCI) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. 45 ఏళ్ల మిథున్ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. కానీ దేశీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్, నాయకత్వ నైపుణ్యాలు, ఢిల్లీ, జమ్మూ–కాశ్మీర్ క్రికెట్ సంఘాల పరిపాలనలో పొందిన అనుభవం ఉంది.
ఈ కారణంగా ఆయనకు ఈ కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తుంది. అలాగే మిథున్ మన్హాస్ భారత స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆడిన అనేక మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించారు. దీంతో ఆయనకే బీసీసీఐ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ చరిత్రలో తొలిసారిగా ఒక అన్‌క్యాప్డ్ క్రికెటర్ అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థకు నాయకత్వం వహించబోతున్నాడనే విశేషత ఆయన పేరుతో జత కానుంది. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా, అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






