- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరూ వస్తున్నారు.. స్టార్క్ ఒక్కడే హ్యాండ్ ఇచ్చాడు !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో... కీలక పరిణామాలు

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో... కీలక పరిణామాలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లిపోయిన చాలా మంది క్రికెటర్లు ఇండియాకు రావడం లేదు. తమ జాతీయ జట్టు అవసరాల నిమిత్తం కొంతమంది ఇండియాకు తిరిగి రావడం లేదు. మరి కొంతమంది.. ఇతర కారణాలు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ( DELHI CAPITALS ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియా ప్లేయర్ లందరూ ఇండియాకు తిరిగి వస్తున్న నేపథ్యంలో... మిచెల్ స్టార్క్ ( Mitchell Starc ) ఒక్కడే రావడంలేదని సమాచారం. ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడని.. అందుకే ఇప్పుడు ఇండియాకు రావడం లేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని మిగతా క్రికెటర్లు హెడ్, కమిన్స్, లాంటి ప్లేయర్లు అందరూ ఇండియాకు తిరిగి వస్తున్నారు. కానీ మిచెల్ స్టార్క్ ఈ టోర్నమెంట్ కు దూరం కాబోతున్నాడు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి... ఉంది. నిజంగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ జట్టుకు దూరం అవుతే... పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.






