ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ బౌలర్.. దాని వల్లే అంటూ..

by Web Desk |
ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ బౌలర్.. దాని వల్లే అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 15 సీజన్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. దీనితో బీసీసీఐ వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అన్ని దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ వేలానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో మరో రెండు జట్లు కొత్తగా చేరాయి. దీనితో ఆటగాళ్లకు వేలంలో ధర ఎక్కువ పలికే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్ వేలానికి ముందే అభిమానులకు షాక్ ఇచ్చాడు. 15వ సీజన్ ఐపీఎల్ వేలం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'తాను ఎక్కువ కాలం బయోబబుల్‌లో ఉండాలను కోవడం లేదని తెలిపాడు. ఎక్కువ కాలం జాతీయ జట్టుకు ఆడటానికే ప్రయత్నిస్తానని వెల్లడించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది. దీనితో ఆటగాళ్లు ఎక్కువ కాలం పాటు బయోబబుల్‌లో ఉండాల్సి వస్తుందని' పేర్కొన్నాడు. గతంలో స్టార్క్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. బీసీసీఐ 15వ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed